ATP: రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రిలో రూ.2.50 లక్షల వ్యయంతో నిర్మించిన త్రాగునీటి శుద్ధి జలకేంద్రాన్ని మంత్రి సత్యకుమార్ యాదవ్, MLA లు కాలవ శ్రీనివాసులు, అమిలినేని సురేంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. ఆసుపత్రికి వచ్చే రోగులు, వారి కుటుంబ సభ్యులు, సిబ్బందికి పరిశుభ్రమైన త్రాగునీరు అందించడం అత్యంత ముఖ్యమని అన్నారు.