NTR: గంపలగూడెం మండలం ఊటుకూరులో ఉన్న నెమలి వెళ్లే దారిలో ఉన్న ప్రధాన కాలువ గుర్రపు డెక్కతో నిండిపోయింది. దీంతో నీటిపారుదల నిలిచిపోయింది. తూటికాడ, గుర్రపు డెక్క చాలా దూరం మేరకు నిలిచిపోవడంతో కాలువలో నీరు నిలిచిపోయిందని రైతులు తెలుపుతున్నారు. అధికారులు స్పందించి వాటి తొలగింపునకు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.