KDP: రాజంపేట పట్టణంలో ఇవాళ ప్రమాదం చోటుచేసుకుంది. రైల్వే స్టేషన్ రోడ్డులోని తిరుమల సిమెంట్ షాపులోకి ఇసుకతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి దూసుకెళ్లింది. ఈ ఘటనలో షాపు ముందు నిలిపి ఉంచిన రెండు బైకులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. షాపులో ఉన్న వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. ట్రాక్టర్ బ్రేకులు పనిచేయకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు.