ATP: తాడిపత్రి వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ‘బీసీ గళం’ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈనెల 26న అనంతపురం నగరంలోని లలిత కళా పరిషత్లో జరగనున్న బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బీసీల హక్కుల సాధన కోసం నిర్వహిస్తున్న ఈ సభకు కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలిరావాలని కోరారు.