TPT: సూళ్లూరుపేటలోని శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి దేవస్థానంలో రేపు ఉదయం 9 గంటలకు హుండీ లెక్కింపు కార్యక్రమం జరగనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. దేవదాయశాఖ అధికారుల పర్యవేక్షణలో ఈ ప్రక్రియ నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనదలచిన భక్తులు పంచే, బనియన్ (డ్రెస్ కోడ్)తో హాజరుకావాలని అధికారులు సూచించారు. ఆసక్తి గల భక్తులు సమయానికి హాజరుకావాలని కోరారు.