నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ పారిశుద్ధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా స్థానిక 23వ డివిజన్ బాబు జగ్జీవన్ రామ్ నగర్ ప్రాంతంలో అధికారులతో కలిసి బుధవారం పర్యటించారు. ఈ మేరకు ఆయన డివిజన్ పరిధిలో నూతనంగా చేపడుతున్న ఇంజనీరింగ్ సివిల్ వర్క్స్ సీసీ రోడ్లు, డ్రైన్ కాలువల నిర్మాణ పనులను పర్యవేక్షించారు. నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.