KRNL: గూడూరు మం. మల్లాపురం బస్ స్టాప్ వద్ద గురువారం 2 రాష్ట్రాల మద్యం తరలిస్తున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో పర్లకు చెందిన చింతకాయల రమేష్, మల్లాపురం గ్రామానికి చెందిన బోయ చిన్న మిన్నెల్ల, కల్లూరుకు చెందిన తలారి క్రిష్ణ ఉన్నారు. వారి వద్ద నుంచి గోవా మద్యం 30 బాటిళ్లు, కర్ణాటక మద్యం 16 టెట్రా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు.