GNTR: తెనాలి 13వ వార్డులో మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు శనివారం పర్యటించారు. అక్కడ మంచినీటి నాణ్యతను స్వయంగా పరిశీలించిన ఆయన, సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం ఎన్టీఆర్ సామాజిక భద్రత పింఛన్లను లబ్ధిదారులకు అందజేశారు. ఆదివారం సెలవు దినం కావడంతో, ప్రభుత్వం ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ చేపట్టిందని కమిషనర్ పేర్కొన్నారు.