VZM: ఉపాధి వేతనదారులకు దినసరి వేతనం పెరిగేలా పనులు చేయించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ ఆడిటోరియంలో ఉపాధి పనుల తీరు, వేతనదారులు అందుకుంటున్న సగటు వేతనంపై సమీక్షించారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని ఎండ తీవ్రత లేని సమయంలో పనులు నిర్వహించాలని చెప్పారు. ఉదయాన్నే వీలైనంత వేగంగా పని మొదలయ్యేలా చూడాలన్నారు.