GNTR: GDCC బ్యాంకు అభివృద్ధికి మేనేజర్లు సమన్వయంతో పని చేయాలని ఛైర్మన్ మక్కెన మల్లికార్జునరావు చెప్పారు. గురువారం మేనేజర్లు, సిబ్బందితో సమావేశమై మాట్లాడుతూ.. జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో ఉమ్మడి జిల్లాలోని 44 బ్రాంచ్లలో రైతుల రుణాలను 2026 మార్చి 31 నాటికి పూర్తిగా రికవరీ చేయాలని సూచించారు. ఇందులో భాగంగా సీఈఓ ఫణికుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.