W.G: ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తణుకు ఎమ్మెల్యే అరమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. మంగళవారం ఇరగవరం మండలం రేలింగి, కావలిపురం గ్రామాలలో జరిగిన ‘సుపరిపాలనలో తొలిఅడుగు-ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. స్థానిక నాయకులతో కలిసి ఏడాది కాలంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఆభివృది వివరించారు.