KKD: మామిడికుదురు మండలం పాసర్లపూడిలో రైతులు ఎదుర్కొంటున్న ముంపు సమస్యను పరిశీలించేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను తీసుకురావాలని మంగళవారం రైతులు ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణను కోరారు. ONGC రోడ్లు, ఉప్పునీటితో చేలు, కొబ్బరితోటలు ముంపునకు గురవుతున్నాయని, ఈ విషయాన్ని పవన్‌కు వివరించాలని రైతులు కోరారు. దీనిపై ఇప్పటికే మాట్లాడానని ఎమ్మెల్యే తెలిపారు.