కృష్ణా: పామర్రు మండలం కొండిపర్రు గ్రామంలో దారుణ ఘటన ఇవాళ చోటు చేసుకుంది. వేడి నీళ్లు కాస్తున్న సమయంలో తండ్రి సురేష్‌తో గొడవ పడిన కొడుకు మహేష్ కత్తితో దాడి చేశాడు. తండ్రిని మన వద్ద నరకడంతో తీవ్రంగా గాయపడిన సురేష్‌ను మచిలీపట్నంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యలోని ఆయన మృతి చెందాడు. కొడుకు మహేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.