GNTR: వైసీపీ ప్రభుత్వం విస్మరించిన నగరాభివృద్ధిని కూటమి ప్రభుత్వం గాడిలో పెడుతుందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహ్మద్ నసీర్ అన్నారు. పాత గుంటూరులో బుధవారం ప్రజా సమస్యల పరిష్కారం కోసం నసీర్ ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఎన్నికల వాగ్దానాలకు అనుగుణంగా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను సీఎం చంద్రబాబు సమర్థవంతంగా అమలు చేస్తున్నారని చెప్పారు.