విశాఖ స్టీల్ ప్లాంట్ను కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల మంత్రి హెచ్.డి. కుమారస్వామి, సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మతో కలిసి సందర్శించి సమీక్షించారు. ప్లాంట్ పునరుజ్జీవనం, అభివృద్ధికి కేంద్రం పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. కోక్ ఓవెన్, బ్లాస్ట్ ఫర్నేస్, వైర్ రాడ్ మిల్లను పరిశీలించి సిబ్బంది పనితీరును అభినందించారు.