కృష్ణా: మచిలీపట్నంలో గురువారం జరిగిన జిల్లా సమీక్ష మండలి సమావేశంలో కలెక్టర్ కొంత మంది అధికారులపై మండిపడ్డారు. జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఆధారంగా గతంలో ఉన్న గణాంకాలను తెలుసుకొని ప్రస్తుత గణాంకాలను స్పష్టంగా సమావేశంలో తెలియజేయాలన్నారు. మత్స్యశాఖ, హార్టికల్చర్ గణాంకాలలో స్పష్టత లేకపోవడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.