సత్యసాయి: పెనుకొండ రైల్వే స్టేషన్ వద్ద గేట్ మెన్ రాజేశ్ మీనా(35) గురువారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రైల్వే స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న అతను తన క్వార్టర్లో ఉరివేసుకొని బలవన్మరణం చేసుకున్నాడు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.