E.G: సంక్రాంతి కోడిపందేలు, జూదక్రీడలకు దూరంగా ఉండాలని గోకవరం ఎస్ఐ పవన్ కుమార్ శనివారం సూచించారు. యువత కేసుల్లో ఇరుక్కుని భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని హెచ్చరించారు. ముందస్తు చర్యల్లో భాగంగా కృష్ణునిపాలెం పంచాయతీలో పందేల కోసం ఏర్పాటు చేసిన బరులను బ్లేడు ట్రాక్టర్‌తో ధ్వంసం చేసినట్లు తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.