PLD: జిల్లాలో LPG కొరత లేదని, వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జాయింట్ కలెక్టర్ సంజన సింహ గురువారం తెలిపారు. గ్యాస్ నిల్వలు తగ్గుతాయనే ప్రచారాలను నమ్మవద్దని సూచించారు. జిల్లాలో గ్యాస్ సరఫరాపై పర్యవేక్షణ కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్ (08647-252999) ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అవసరాలకు తగిన విధంగా సిలిండర్ల సరఫరా కొనసాగుతుందని తెలిపారు.