TG: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ హెచ్‌జే దొర మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పోలీసు శాఖలో పలు సంస్కరణలు తీసుకురావడంలో, పోలీసు శాఖను ప్రజలకు చేరువ చేయడంలో ఆయన ఎంతో కృషి చేశారన్నారు.