BPT: సంతమాగులూరు మండలం తంగేడుమల్లి వద్ద శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో డి. సుబ్బారావు (58) అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఆయన ఎక్సెల్ వాహనంపై వెళ్తుండగా, వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న 108 సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రుడిని నరసరావుపేట ఆసుపత్రికి తరలించారు.