కృష్ణా జిల్లాలో ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు మరి కొద్దిసేపట్లో ప్రారంభం కానున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 63 పరీక్షా కేంద్రాల్లో మొత్తం 25,406 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. పరీక్షల నిర్వహణ కోసం 900 మంది ఇన్విజిలేటర్లతో పాటు అదనంగా 3, సిట్టింగ్ 3 ఫ్లైయింగ్ స్క్వాడ్లు పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహించనున్నాయి.