కోనసీమ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈనెల 10న అమలాపురంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే ఆనందరావు కార్యాలయ వర్గాలు తెలిపాయి. స్థానిక శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో ఉదయం 10 గంటల నుంచి ఈ జాబ్ మేళా జరుగుతుందన్నారు. ఈ జాబ్ మేళాలో టెన్త్ నుండి ఆపైన చదివిన వారందరూ హాజరు కావచ్చు అని సూచించారు.