అన్నమయ్య: కురబలకోట సర్కారుతోపు వద్ద గురువారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మదనపల్లె చౌడేశ్వరిదేవి ఉత్సవాలకు వచ్చి తిరిగి వెళ్లే క్రమంలో బైక్ డివైడర్‌ను ఢీకొన్నట్లు తెలుస్తోంది. మృతులు B.కొత్తకోటకు చెందిన సురేంద్ర, మదనపల్లికి చెందిన మాధవ, ముదివేడుకు చెందిన మహేష్‌గా పోలీసులు గుర్తించారు. కాగా, ముగ్గురు మంచి స్నేహితులుగా సమాచారం.