ATP: గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో మంగళవారం పూర్వాభాద్ర తిరునక్షత్రం సందర్భంగా ఆలయంలో స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. ఆలయ యాగశాలలో ఆంజనేయస్వామి ఉత్సవ విగ్రహానికి తిరుమంజన స్నపన, మాన్య సూక్త హోమం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు.