సత్యసాయి: బత్తలపల్లిలో నిర్వహించిన పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. దేశం ప్రథమం, పార్టీ తదుపరి, స్వార్థం చివర అనే భావనతో కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. 1985లోనే అటల్ బిహారీ వాజపేయి చెప్పినట్లు కాంగ్రెస్ను ప్రజలు తిరస్కరించే రోజు వచ్చిందని ఆయన గుర్తుచేశారు.