KRNL: సుంకేసుల డ్యాం వద్ద నీటి నిల్వలు, ప్రస్తుత నీటిమట్టం పరిస్థితులను జిల్లా కలెక్టర్ ఏ. సిరి ఇవాళ పరిశీలించారు. డ్యాంలో అందుబాటులో ఉన్న నీటి పరిమాణం, నిర్వహణ అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం డ్యాం పరిసర ప్రాంతాల్లో చేపల పెంపకం కోసం ఏర్పాటు చేసిన పాండ్స్‌ను పరిశీలించి, చేపల ఉత్పత్తి పెంపు, నిర్వహణపై సంబంధిత అధికారులకు సూచనలు చేశారు.