CTR: చిత్తూరులో దారుణ హత్యకు గురైన అప్పటి మేయర్ కటారి అనురాధ, ఆమె భర్త మోహన్ కేసుపై నేడు కోర్టు శిక్ష ఖరారు చేయనుంది. ఇప్పటికే ఐదుగురు నిందితులపై నేర ఆరోపణ రుజువైనట్లు తేల్చిన కోర్టు నేడు శిక్ష ఖరారు చేయనుంది. నేరం రుజువైన నిందితులు చిత్తూరు జిల్లా జైల్లో ఉన్నారు. తీర్పు నేపథ్యంలో నగరంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.