ప్రకాశం: ఒంగోలు నగరంలోని పార్టీ కార్యాలయం నందు ఆదివారం ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ డ్వాక్రా గ్రూప్స్లోని వీఓఏలకు ఉచితంగా చరవాణిల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళా సంఘాల సాధికారతకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో స్వయం సహాయక సంఘాల బలోపేతానికి ఈ విధమైన చర్యలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు.