కాకినాడ: పుదుచ్చేరి, యానాం ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో పటిష్ఠ నిఘా ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ షాన్ మోహన్ తెలిపారు. ఈనెల 18 నుంచి ఏప్రిల్ 9 వరకు నీలపల్లి, మల్లవరం, సుంకరపాలెం వద్ద 3 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. 24 గంటల పాటు రొటేషన్ పద్ధతిలో రెవెన్యూ, ఎక్సైజ్, కమర్షియల్ టాక్స్ అధికారులు ఇక్కడ విధులు నిర్వహిస్తారు.