కోనసీమ: రాజోలు నియోజకవర్గంలో 1139 మంది రైతులకు చెందిన 60,373 కొబ్బరి చెట్లు ఉప్పునీటి ముంపు వలన చనిపోయినట్లు గుర్తించామని శుక్రవారం రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ తెలిపారు. కేశవదాసుపాలెం, కాట్రేనిపాడు, చింతలమోరి, శంకరగుప్తం, కేశనపల్లి, గూడపల్లి, తూర్పుపాలెం, గొల్లపాలెం, గుబ్బలపాలెం, పడమటిపాలెం గ్రామాల్లో చనిపోయిన కొబ్బరిచెట్ల వివరాలు అధికారులు సేకరించారన్నారు.