KRNL: ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. ఇవాళ భార్య నరసమ్మపై భర్త రామయ్య కత్తితో దాడి చేశాడు. కొంతకాలంగా దూరంగా ఉంటున్న ఈ దంపతులు, కూతురు శాంతి ప్రసవం కోసం ఆసుపత్రికి వచ్చిన సమయంలో ఈ ఘటన జరిగింది. సమాచారం తెలుసుకుని ఆసుపత్రికి వచ్చిన రామయ్య నరసమ్మపై దాడి చేయగా.. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది.