NTR: ఏ కొండూరు మండలం చైతన్య నగర్ తండాకు చెందిన భూక్య తిరిపి (65) కిడ్నీ వ్యాధితో బాధపడుతూ, చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. ఆమె భౌతిక కాయానికి జిల్లా కౌలు రైతు సంఘం కార్యదర్శి డేవిడ్, సీపీఐ మండల కార్యదర్శి వెంకటేశ్వరావు పాల్గొని నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మృతురాలికి ఏడుగురు సంతానం ఉన్నారు.