KDP: టీడీపీ కార్యకర్తలు నడి బజారులో రాళ్లు రువ్వుకున్నా పోలీసులు కేసు కట్టరా? అని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి బుధవారం ప్రశ్నించారు. ప్రొద్దుటూరు పౌరుల ప్రాణాలకు ఇబ్బంది కలిగించే విధంగా రాళ్లు విసురుకుంటే కేసు నమోదు చేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. పోలీసులు కేసు నమోదు చేయకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సిన పరిస్థితి వస్తుందన్నారు.