GNTR: తెనాలిలో వడదెబ్బకు గురై తాపీ కార్మికుడు మృతి చెందిన ఘటన నెలకొంది. మార్కాపురం జిల్లాకు చెందిన కండెపోగు వినయ్ కుమార్ (37) తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాల ఆవరణలో భవన నిర్మాణ పనులను చేస్తున్నాడు. ఇక్కడ ఓ రేకుల షెడ్డులోనే తోటి కార్మికులతో కలిసి ఉంటున్నాడు. గురువారం రాత్రి అనారోగ్యానికి గురికావడంతో ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు.