NDL: నంద్యాల పట్టణంలో ఇవాళ రజక సంఘం నాయకులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా రజక సంఘం కార్పొరేషన్ ఛైర్మన్ సావిత్రి పాల్గొన్నారు. నంద్యాల నుంచి ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో జరుగుతున్న రజక ఆకాంక్ష సభకు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని ఆమె అన్నారు. రజకుల సమస్యలను పరిష్కరించడానికి ఈ సభ ఏర్పాటు అని ఆమె తెలిపారు.