ప్రకాశం: కంభంలో విషాదం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు ఖాదర్ బి (56) అనే మహిళ కంభంలోని అర్బన్ కాలనీలో నివాసం ఉంటుంది. అయితే ఖాదర్ బి తన పెన్షన్ వెరిఫికేషన్ కోసం బుధవారం గిద్దలూరు ఆసుపత్రికి వెళ్ళగా అక్కడ అస్వస్థకు గురైంది. వెంటనే ఆసుపత్రిలో ఎమర్జెన్సీ వార్డుకు తరలించి చికిత్స అందించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.