KDP: మైదుకూరు మండలం చింతకుంట వద్ద బొలెరో వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పది మందికి గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని స్థానికులు తెలిపారు. నల్లపురెడ్డి పల్లె గ్రామస్తులు అహోబిలం నరసింహస్వామి దర్శించుకుని తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. గాయపడ్డ వారిని మైదుకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.