W.G: భీమవరం పట్టణంలో ఉన్న స్వర్ణ వార్డు కార్యాలయం నెంబర్-22ను బుధవారం కలెక్టర్ నాగరాణి ఆకస్మికంగా సందర్శించారు. బూత్ లెవల్ అధికారులతో సమావేశమై ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఓటర్లు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారా, విదేశాలలో నివసిస్తున్నారా వంటి వివరాలను సమగ్రంగా సేకరించాలని ఏమైనా ఇబ్బందులు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు.