ASR: ఆంధ్రవిశ్వవిద్యాలయంలో మంగళవారం బీ.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్టీఐ కమిషనర్ పి.ఎస్. నాయుడు మాట్లాడుతూ.. అంబేద్కర్ భావజాలాన్ని నిత్య జీవితంలో ఆచరించాలన్నారు. సమానత్వం, హక్కుల సాధనకు రాజ్యాంగం రూపంలో పునాది వేసిన మహనీయుడని పేర్కొన్నారు. జ్ఞానమే వ్యక్తి పురోగతికి శక్తివంతమైన ఆయుధమని తెలిపారు.