AKP: పరవాడ మండలం బొద్దపువానిపాలెంలో వేంచేసియున్న దుర్గమాంబ అమ్మవారి ఆలయ వార్షికోత్సవాన్ని సోమవారం వైభవంగా నిర్వహించారు. అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పలువురు అమ్మవారిని దర్శించుకుని పసుపు కుంకుమ సమర్పించి పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు.