సత్యసాయి: జిల్లాలో ఆర్డీటీ సంస్థకు ఎఫ్సీఆర్ఏ అనుమతులు లభించాయి. సంస్థపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని తేలిందని సాకే వినయ్ కుమార్ పేర్కొన్నారు. ఈ విజయం ప్రజలు, నాయకుల పోరాట పటిమ వల్లే సాధ్యమైందన్నారు. కేంద్ర ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. అనుమతులు రావడంతో ఇక నుంచి ఆర్డీటీ సేవలు పేదలకు యథావిధిగా అందుతాయని ఆయన స్పష్టం చేశారు.