KRNL: కృష్ణగిరి(M) ఎరుకలచెరువు సమీపంలో నాపరాతి బండల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడటంతో బేతంచెర్ల మండలం గోర్లగుట్టకు చెందిన బూడిది నాగప్రసాద్ (32) అక్కడికక్కడే మృతి చెందారు. సోమవారం SI కృష్ణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.