ప్రకాశం: టంగుటూరులో ఎస్సై నాగమల్లేశ్వరరావు రోడ్డు ప్రమాదాలపై శనివారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని మద్యం సేవించి వాహనాలు నడపరాదని అన్నారు. అలాగే ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని ఎస్సై పేర్కొన్నారు.