నెల్లూరు జిల్లా ముత్తుకూరు మత్స్య కళాశాలలో శుక్రవారం రోజు ప్రపంచ మత్స్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మత్స్య కళాశాల అసోసియేట్ డీన్ డా. కె.ధనపాల్ మాట్లాడుతూ.. మత్స్యకారులు అనేక సవాళ్ళను ఎదుర్కొంటూ కూడా సామాజిక, ఆర్థిక ప్రయోజనాలను అందిస్తున్నారని కొనియాడారు. ముఖ్య అతిధిగా విచ్చేసిన గోవిందయ్యని ఘనంగా సత్కరించారు.