TPT: రామచంద్రాపురం మండలంలోని 4,307 మంది రైతుల బ్యాంకు ఖాతాలో ప్రభుత్వం నగదు జమ చేస్తున్నట్లు అగ్రికల్చర్ ఆఫీసర్ మమత ఇవాళ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ‘పీఎం కిసాన్-అన్నదాత సుఖీభవ’ కింద రూ.6 వేలు చొప్పున విడుదల చేశాయని చెప్పారు. నగదు జమ కాకపోతే అగ్రికల్చర్ ఆఫీసర్‌కు సమాచారం ఇవ్వాలని ఆమె కోరారు.