SKLM: పాతపట్నంలో వెలసి ఉన్న ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం శ్రీ నీలమణి దుర్గ అమ్మవారిని గురువారం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ పండితులు వేదమంత్రాలతో ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. అమ్మవారి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలందరి మీద ఉండాలని ఆయన కోరుకున్నారు.