సత్యసాయి: పుట్టపర్తిలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోషకాహార పక్షోత్సవాల వేడుకల్లో ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి పాల్గొన్నారు. మహిళలు గర్భిణీ సమయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకొని బిడ్డ సంరక్షణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా 15 మంది గర్భిణీ మహిళలకు ఎమ్మెల్యే తన చేతుల మీదుగా సీమంతం కార్యక్రమం నిర్వహించారు.