KDP: నగరంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గర్భాశయ ముఖ క్యాన్సర్ నివారణకు 14 సంవత్సరాల లోపు బాలికలకు ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న HPV వ్యాక్సిన్ పై అవగాహన పోస్టర్ను ప్రభుత్వ విప్, కడప ఎమ్మెల్యే రెడ్డెప్ప మాధవి విడుదల చేశారు. ఈ టీకా ద్వారా బాలికలు గర్భాశయ క్యాన్సర్ ముప్పు నుంచి రక్షణ పొందవచ్చన్నారు. బాలికలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.