KDP: చివరి కార్తీక సోమవారం సందర్భంగా లంకమల శైవ క్షేత్రానికి 3 ప్రత్యేక బస్సులు సిద్ధం చేసినట్లు బద్వేలు ఆర్టీసీ డీఎం చైతన్య నిరంజన్ నిన్న ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఉదయం 6:30, 10:00 మధ్యాహ్నం 1:00 గంటకు బద్వేలు ఆర్టీసీ బస్టాండ్ నుంచి బస్సులు వెళ్తాయని, భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.